ప్రపంచపు నాలుగు చెరుగుల నుండీ వీక్షకులు మంత్ర ద్రష్ట కాదంబరిని అత్యంత శ్రద్ధాసక్తులతో చదువుతున్నారు . మీ ఆదరణ , అభిమానము నన్ను ఉద్దీపితుడను చేస్తున్నది .
మనకు స్వాతంత్ర్యము వచ్చు వరకూ అణగదొక్కబడిన హిందూ సంస్కృతి మరలా తలయెత్తి సగర్వంగా తన వైభవాన్ని చాటుకోవాలంటే , మన సంస్కృతీ సాంప్రదాయాలను ప్రతిబింబించే దేనినైనా గౌరవించి ఆదరించాలన్న మీ అందరి అభిమతమూ , మీ సంస్కారమూ , మీ అభిమానమూ చూస్తుంటే , దాని ముందు నేను ఎంత చిన్నవాడనో అర్థమగుతున్నది . ఏదో కేవలము నా సంతోషము కోసము మొదలు పెట్టిన ఈ అనువాదము ఇప్పుడు ఇంతటి ఆదరణ కు నోచుకోవడముతో , నా బాధ్యత పెరిగి , ఒళ్ళంతా కళ్ళు చేసుకుని , మనసూ బుద్ధీ ఏకాగ్రతను నింపుకొని రాయవలసిన అగత్యము కనబడుతున్నది ..
ఎందరో మహానుభావులు , విద్యావంతులు , సాహితీ అభిమానులు , సంప్రదాయ బద్ధులు , ఆచార శీలురు అయిన మీ అందరి పలు విధాలైన అభిలాషలు , అభీష్టాలు ఈ ఒక్క విషయములో సమాన భావాన్ని వహించడము ఎంతో హర్షణీయము , ఆమోద యోగ్యము గా ఉంది .
కొన్నాళ్ళు కుంటు బడిన హైందవ సంస్కృతిని పునరుద్ధరించాలన్న దృఢమైన అందరి ఆకాంక్ష ద్యోతకమగుతున్నది . ముఖ్యంగా నేటి యువతీ యువకులు , ఈ విషయాలపై ఆసక్తి పెంచుకోవడము అత్యంత శుభ పరిణామము.
నా వల్ల ఎటువంటి పొరపాట్లూ తప్పిదాలూ జరగకుండా విజయవంతంగా , జనాదరణ యోగ్యంగా ఈ అనువాదాన్ని పూర్తి చేయుటకు ఆ భగవంతుడి కృప కోసము ప్రార్థిస్తున్నాను .
మీ జనార్దన శర్మ

శర్మ గారూ , ఇలా మధ్యలో నమస్కారాలు పెడితే , అప్పుడే అయి పోయిందేమో అని గుండెలో గుబులైంది గదా ! Great work. please keep it up. ముందు మీరు ఋషి ఋణం, దేవ ఋణం తీర్చు కొంటున్నట్లు ఉంది. - kumara swamy vullaganti
ReplyDeletekumara swamy vullaganti గారూ ,
ReplyDeleteహహ...హ...
మీ అభిమానము మీతో అలా అనిపిస్తుంది. ఇది నాకు ఇంత సంతోషం కలిగించటానికి కారణము , ఇది నా మొదటి అనువాదము , రెండో పుస్తకము మాత్రమే . నా మొదటి పుస్తకాన్ని కూడా ఇక్కడ ఇస్తాను . అది సిద్ధంగా ఉంది కానీ ఇది పూర్తి గా ఇచ్చాక అది ఇవ్వాలని నా ఉద్దేశము .. అలాగే , దేవుడు గారిదే ఇంకో పుస్తకము " మహా దర్శన " కూడా అనువదించాలని నా ఉబలాటము . అందులో దీనిలొ కన్నా విషయము మరింత గంభీరము , లోతైన రహస్యాలు ఉన్నాయి .