SHARE

Monday, August 27, 2012

" బ్రహ్మ యజ్ఞము " రెండవ భాగము




  బ్రహ్మ యజ్ఞము విధానము 

( కారణాంతరముల వలన మంత్రములకు ఇక్కడ స్వరమునివ్వడము లేదు . )

     తూర్పుకు  తిరిగి దర్భాసనముపై కూర్చొని , రెండు సార్లు ఆచమనము చేయవలెను . ఉంగరపువేలికి పవిత్రమును ( దర్భ ముడి ఉంగరం )  ధరించి , ప్రాణాయామము చేయవలెను . (  ఆచమనము చేయునప్పుడు ఎప్పుడు కూడా ఉంగరపు వేలికి పవిత్రం ఉండకూడదు ) దేశకాలములను కీర్తించి , ఈ విధముగా సంకల్పము చెప్పవలెను .


మమ ఉపాత్త దురితక్షయ ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం బ్రహ్మ యజ్ఞేన యక్షే  | 

ఈ మంత్రములను చెప్పవలెను 

|| విద్యుదసి విద్యమే పాప్మానమ్ | ఋతాత్ సత్యమ్ ఉపైమి | ఋచో అక్షరే పరమే వ్యోమన్ | యస్మిన్ దేవా అధి విశ్వే నిషేదుః | యస్తన్న వేద | కిమ్ ఋచా కరిష్యతి | య ఇత్తద్విదుః | త ఇమే సమాసతే || 

     మణికట్టుల  వరకూ చేతులను కడుగుకొని , మూడు సార్లు మౌనంగా అంతశ్శుద్ధి కోసము ఆచమనములో వలె నీటిని తాగవలెను . పెదవులను రెండు సార్లు నీటితో తుడుచుకొనవలెను . తర్వాత మరల శుద్ధి కోసము హస్తములను కడుగుకొనవలెను . తరువాత కుడి చేతి వేళ్లతో ఒక్కొక్క సారి నీటిని తీసుకొని , శిరస్సును , కన్నులను , ముక్కును , చెవులను , హృదయమును ఒక్కొక్కసారి స్పృశించవలెను . ఇది , శుద్ధికీ , అదృష్టమునకూ. అటులనే ఎడమ హస్తమును , ఎడమ పాదమును కూడా నీటితో ప్రోక్షించవలెను . 

     తరువాత ,  కుడి పాదమును ఎడమ మోకాలిపై స్పృశించునట్లు పెట్టి , ( సుఖాసనములో వలె ,) ఎడమ అరచేతిని కుడి మోకాలిపై పైకి తెరచిపెట్టి , ఆఎడమ అరచేతిలో కుడి అరచేతిని మూయవలెను . రెండు బొటనవేళ్ళు ఒకదానికొకటి సమాంతరముగా కాక , ఒకదానికొకటి అడ్డముగా ఉండవలెను . అన్ని వేళ్ళూ మడచి ఉండవలెను . ( మామూలుగా పూజా సంకల్పములలో ఇలాగ ఉంచుట తెలిసినదే ) 

తర్వాత ఈ కింది విధముగా స్వాధ్యాయమును చేయవలెను 

ఓం భూః తత్సవితుర్వరేణ్యం |
ఓం భువః  భర్గో దేవస్య ధీమహి |
ఓగ్ం సువః ధియో యోనః ప్రచోదయాత్ |

ఓం భూః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి |
ఓం భువః ధియో యోనః ప్రచోదయాత్ |
ఓగ్ం సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ |

ఓం భూర్భువస్సువః | సత్యం తపః శ్రద్ధాయాం జుహోమి | 

తరువాత , వేదములోని కింది అనువాకాలను పఠించవలెను . ఎవరి స్వశాఖను వారు మొదట పఠించి , తరువాత ఇతర శాఖ ను పఠించవలెను . ఇక్కడ మొదట యజుర్వేదపు మంత్రములు ఇవ్వడమైనది 

యజుర్వేదం 

శ్రీ గురుభ్యో నమః హరిః ఓం 

|| ఇషేత్వోర్జేత్వా వాయవస్థో పాయవస్థ ...........యజమానస్య పశూన్పాహి ||  ( ..అను అనువాకము )

|| యజ్ఞస్య ఘోషదసి .....ఋతుభిః కల్పయాతి ||  ( మొదటి కాండ లోని మొదటి ప్రశ్న మొత్తం ) 

లేదా  మొదటి ప్రశ్న లోని మొదటి మూడు అనువాకాలు 

|| ఇషేత్వోర్జేత్వా వాయవస్థో పాయవస్థ ...........యజమానస్య పశూన్పాహి || 

|| యజ్ఞస్య ఘోషదసి.....దేవంగమమసి || 

|| శున్ధధ్వం దైవ్యాయ కర్మణే .......హవ్యగ్ం రక్షస్వ ||  

 ( దీని తర్వాత , బ్రాహ్మణములోని " బ్రహ్మ సంధత్తం ....అనే వాక్యాలను పఠించవచ్చు .)

ఋగ్వేదం 


|| అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం  | హోతారం రత్న ధాతమం || 

సామ వేదం 

|| అగ్న ఆయాహి వీతయే గృణానో హవ్యదాతయే | నిహోతా సత్సి బర్హిషి || 

అథర్వణ వేదం 

|| శం నో దేవీరభిష్టయ ఆపో భవంతి పీతయే | శం యో రభిస్రవంతునః || 

హరిః ఓం 


     వేదపాఠము కాని వారు , ప్రణవము , వ్యాహృతులతో పాటు గాయత్రీ మంత్రాన్ని యథా శక్తి జపించవలెను . దాని తర్వాత గాథలు , పురాణాలు పఠించవలెను .

తరువాత , ఈ కింది మంత్రాన్ని మూడు సార్లు జపించవలెను 

నమో బ్రహ్మణే నమో అస్త్వగ్నయే నమః పృథివ్యై నమ ఓషధీభ్యః | నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి ||  ( మూడు సార్లు ) 

రోగాదుల వలన అశక్తులైన వారు ఉన్నచోటే కూర్చుని మనసులోనే చేయవచ్చును . 

తరువాత , కింది మంత్రాన్ని చెప్పవలెను 

|| వృష్ఠిరసి వృశ్చమే పాప్మానమ్ | ఋతాత్ సత్యముపాగామ్ || 

మరలా చేతి వేళ్లతో ఒక్కొక్క సారి నీటిని తీసుకొని , శిరస్సును , కన్నులను , ముక్కును , చెవులను , హృదయమును ఒక్కొక్కసారి స్పృశించవలెను . 

తర్పణము 

     ఇప్పుడు దేవతలకు , కాండ ఋషులకు ,  పితృ దేవతలకు తర్పణమునియ్యవలెను . దేవతలకు ఒక్కొక్కసారి , కాండ ఋషులకు రెండు రెండు సార్లు , పితృ దేవతలకు మూడు మూడు సార్లు ఇవ్వవలెను .  

ఆచమనము , ప్రాణాయామము చేసి , ---పరమేశ్వర ప్రీత్యర్థం దేవర్షి పితృ తర్పణం చ కరిష్యే అని చెప్పి , 


దేవతలకు  , తూర్పుకు తిరిగి యుండి , దైవ తీర్థం లో , ఉపవీతులై ( యజ్ఞోపవీతం సవ్యముగా వేసుకొని , ) ఒక్కొక్క సారి ఇవ్వ వలెను. 

ఓమితి సర్వత్ర బ్రహ్మాదయో యే దేవాః 

తాం దేవాం స్తర్పయామి 
సర్వాం దేవాం స్తర్పయామి 
సర్వాం దేవ గణాం స్తర్పయామి 
సర్వా దేవ పత్నీ స్తర్పయామి 
సర్వా దేవ గణ పత్నీ స్తర్పయామి 
సర్వాం దేవ పుత్రాం స్తర్పయామి 
సర్వాం దేవ పౌత్రాం స్తర్పయామి 
భూర్దేవాం స్తర్పయామి 
భువో దేవాం స్తర్పయామి 
సువర్దేవాం స్తర్పయామి 
భూర్భువస్సువర్దేవాం స్తర్పయామి 

కాండ ఋషులకు తర్పణము 

యజ్ఞోపవీతాన్ని మాలగా వేసుకొని ( నివీతి ) , ఉత్తరమునకు తిరిగి ,  ఋషితీర్థములో రెండు రెండు సార్లు తర్పణము నివ్వవలెను . 

 శ్రీ  కృష్ణద్వైపాయనాదయో యే ఋషయః 

తాన్ ఋషీగ్ స్తర్పయామి తర్పయామి | 
సర్వాన్ ఋషీగ్ స్తర్పయామి తర్పయామి | 
సర్వానృషి గణాగ్ స్తర్పయామి తర్పయామి | 
సర్వా ఋషి పత్నీ స్తర్పయామి తర్పయామి | 
సర్వా ఋషి గణ పత్నీ స్తర్పయామి తర్పయామి | 
సర్వానృషి పుత్రాం స్తర్పయామి తర్పయామి | 
సర్వానృషి పౌత్రాం స్తర్పయామి తర్పయామి | 
ప్రజాపతిం కాండర్షిం తర్పయామి తర్పయామి | 
సోమం కాండర్షిం తర్పయామి తర్పయామి | 
అగ్నిం కాండర్షిం తర్పయామి తర్పయామి | 
విశ్వాన్ దేవాన్ కాండర్షీగ్ స్తర్పయామి తర్పయామి | 
యాజ్ఞికీ ర్దేవతా ఉపనిషద స్తర్పయామి తర్పయామి | 
వారుణీ ర్దేవతా ఉపనిషద స్తర్పయామి తర్పయామి | 
హవ్యవాహం తర్పయామి తర్పయామి | 
విశ్వాన్ దేవాన్ కాండర్షీగ్ స్తర్పయామి తర్పయామి | 

బ్రహ్మాణం స్వయంభువం తర్పయామి తర్పయామి ( ఇది మాత్రం బ్రహ్మ తీర్థములో ఇవ్వాలి . బొటన వేలి అడుగు నుండీ వదల వలెను ) 

విశ్వాన్ దేవాన్ కాండర్షీగ్ స్తర్పయామి తర్పయామి | 
అరుణాన్ కాండర్షీగ్ స్తర్పయామి తర్పయామి | 
సదసస్పతిం తర్పయామి తర్పయామి | 
ఋగ్వేదం తర్పయామి తర్పయామి | 
యజుర్వేదం తర్పయామి తర్పయామి | 
సామ వేదం తర్పయామి తర్పయామి | 
అథర్వాంగిరసం తర్పయామి తర్పయామి | 
ఇతిహాస పురాణం తర్పయామి తర్పయామి | 
కల్పం తర్పయామి తర్పయామి | 

పితృ తర్పణము 

యజ్ఞోపవీతమును అపసవ్యముగా వేసుకొని , దక్షిణమునకు తిరిగి , పితృ తీర్థములో మూడు మూడు సార్లు తర్పణము ఇవ్వ వలెను . 

సోమః పితృమాన్ యమోంగిరస్వాన్ అగ్ని కవ్యవాహనాదయో యే పితరః 

తాన్ పితౄగ్ స్తర్పయామి తర్పయామి తర్పయామి 
సర్వాన్ పిత్రూగ్ స్తర్పయామి తర్పయామి తర్పయామి 
సర్వ పితృ గణాగ్ స్తర్పయామి తర్పయామి తర్పయామి 
సర్వ పితృ పత్నీ స్తర్పయామి తర్పయామి తర్పయామి 
సర్వ పితృ గణ పత్నీ స్తర్పయామి తర్పయామి తర్పయామి 
సర్వాన్ పితృ పుత్రాం స్తర్పయామి తర్పయామి తర్పయామి 
సర్వాన్ పితృ పౌత్రాం స్తర్పయామి తర్పయామి తర్పయామి 

పైవన్నీ, పితృ లోకములో స్థిరముగా నున్న పితృ దేవతలకు .  తరువాత ,  "  పితృ తర్పణము    http://vibhaataveechikalu.blogspot.in/2012/07/blog-post_25.html  "  అన్న ఇంకొక పుస్తకము చూసి , మన వెనుకటి మూడు తరాలలో మరణించిన వారికి తర్పణము ఇవ్వవలెను . 


|| అనేన మయా కృత  బ్రహ్మ యజ్ఞాంగ నిత్య తర్పణ కర్మణా శ్రీ పరమేశ్వరః ప్రియంతాం || 

ఆచమనము చేయవలెను. 




7 comments:

  1. ఈ సంస్కృత మంత్రాలు/వాక్యాలూ, కేవలం సంస్కృతం వచ్చిన వారికేనా ?

    మీరెంత తెలుగులో వ్రాసినా, అర్థం కాని ఈ పదాలను ఒక్కో అక్షరం, ఆగి ఆగి చదవ వలసి వస్తుందేమో!

    సంస్కృతం డిస్కవర్డ్ భాష, ఇన్వెంటెడ్ కాదు అని అర్థమయ్యేలా సద్గురు జగ్గి వాసుదేవ్ చెప్పారు. అలాంటప్పుడు ఈ పదాలకు మంత్రములా పని చేసే శక్తి ఉన్నదనుకోవడానికి ఆస్కారం ఉంది. కానీ, అర్థం అవగతం అయినపుడే ప్రభావం ఉండాలి అనేది నాకు తెలిసిన సిద్ధాంతం. చిలుక ఈ మంత్రాలను పఠిస్తే ఫలితం పొందలేదు కదా!!

    అందుకని, సంస్కృతం నేర్చుకుని ఈ మంత్రాలను అవగతం చేసుకోమంటారా ? లేక వీటిని తెనుగీకరించడం(పూర్తి అచ్చ తెలుగు పదాలలో) వలన ఎక్కువ మేలు కలుగునా?

    ReplyDelete
    Replies
    1. అమరనాథ్ కథ వినలేదా ?
      గుడ్డులోనుంచి వచ్చిన పక్షి , శివుడు పార్వతికి చెపుతున్న విద్య నేర్చుకొని
      ...ఆ చిలకే చివరికి శుక మహర్షి అయింది ?
      -kumar s vullaganti

      Delete
  2. మంచి ప్రశ్నే వేశారు ... మీ ప్రశ్నకు జవాబు ఏది ఔనో అది తెలుసుకోవాలంటే , ఏది కాదో అది చెప్పడము సులువు . ఒక్కొక్కదాన్నీ తొలగిస్తూ చివరికి సమాధానం పొందవచ్చు . ఎందుకంటే , ఔనని ఏది చెప్పినా , దానితో పాటే సవా లక్ష సందేహాలు వస్తాయి కాబట్టి .

    వేద మంత్రాలు , వాక్యాలు శబ్ద ప్రధానమైనవి . అర్థము తెలుసుకొనుట ముఖ్యమే , కానీ వేదపు విశిష్టత ఏమంటే , సరైన ఉచ్చారణతో పలికితే ఆ శబ్ద తరంగాలు మన శరీరమును , ప్రకృతినీ కూడా ప్రభావితము చేయగలవు . వేదఘోష ఒక్కసారి విన్నవాడు అర్థం తెలీకపోయినా ముగ్ధుడవుతాడు . ' మంత్ర ముగ్ధులు ' అన్న పదం ఇందుకే వచ్చింది . ఈ వాక్యాలు , మంత్రాలు విని మాత్రమే నేర్చుకునేవి ( ఇప్పుడైతే పుస్తకాలున్నాయి ) అందుకే వీటిని శృతి అన్నారు .

    ॥ ఇద మంధం తమః కృత్స్నం జాయేత భువన త్రయం
    యది శబ్దాహ్వయం జ్యోతి రాసంసారం న దీప్యతే ॥

    మూడు లోకములలోను బహువిధ ప్రాణి కోటిలోను మానవునికి అంధకారమును తొలగించి మహౌన్నత్యమును సమకూర్చి పెట్టినది వర్ణ సంకలితమగు శబ్దమే . ఈ వేదాన్ని గనక అపస్వరములతో చేర్చి , సరిగ్గా ఉచ్చరించలేకపోతే వజ్రము వలె హింసించును . దీనికి ఛందస్సు , స్వరము , వంటివి ఉన్నాయి . అవి వేదమునకే ప్రత్యేకము . వీటిని ఇంకోభాషలోకి రాస్తే ఆ ప్రత్యేకత పోయి , తమ విలువను కోల్పోతాయి .

    ఆ కారణము చేతనే వేదాన్ని మొదట కేవలము శబ్దముగా విని నేర్చుకోవలెను . దాని అర్థము తరువాత తరువాత అదే బోధపడుతుంది . ఇది వేదము నేర్చిన అందరి అనుభవము. సంస్కృతాన్ని అమితంగా ద్వేషించే కొందరు పక్క రాష్ట్రము వారు అనేక స్తోత్రాలను వారి భాష లోకి రాసుకున్నారేగానీ , వేదాన్ని రాసుకోలేకపోయారు . దీనికి కారణము అది వీలు పడదు కాబట్టే . ఇలా ఒక్కొక్కరు తమ తమ భాషలోకి రాసుకుంటే , " స్వదేశే పూజ్యతే రాజా , విద్వాన్ సర్వత్ర పూజ్యతే ' అన్న భర్తృహరి సుభాషితానికి అర్థం లేకుండా పోతుంది , ఎందుకంటే , ఇతర దేశాలలో ఇక్కడి విద్వాంసుల భాష అర్థం కాదు కాబట్టి . ధర్మ ప్రచారానికి సంస్కృతం మనకు ( భారతీయులకు ) ఉన్న ఏకైక సాధనము . ఎందుకంటే , చాలా భారతీయ భాషలు సంస్కృతము నుండీ వచ్చినవే . తెలుగు బాగా వచ్చిన వారికి సంస్కృతము సులభంగా అర్థమవుతుంది .

    వేదము నేర్చుకునే వారు మొదట కొన్నేళ్ళు అక్షరాలు , స్వరాలు తప్పుగా పలుకుతారు . గురు కృప ఉంటే కఠోర శ్రమతో గానీ అవి సరిదిద్దుకోలేరు . అంత కష్టపడీ వారునేర్చుకునేది , దానికన్నా ఎక్కువ ఫలముంది కాబట్టి . ఇక్కడ రాసినవి మరీ కష్టముగా ఏమీ లేవు . అర్థము కూడా సులభముగానే బోధ పడుతుంది . కొంచము ప్రయత్నిస్తే , సంస్కృతము అన్నిటికన్నా సులభమైన భాష అని ఎవరైనా గ్రహిస్తారు . ఫలితము పొందాలంటే ఆమాత్రం కష్ట పడవద్దా ?

    మొన్నటికి మొన్న ఒక ఇతర మతానికి చెందిన మహానుభావుడు , తెలుగు భాష పైకి రాకపోవడానికి కారణము పూజలు సంస్కృతములో చేయడమే అన్నాడు . వారలా అనుటకు కారణము సులభముగా తెలిసేదే . కానీ సనాతన ధర్మాన్ని పాటించే మనము మన మాతృభాషలకే మాతృభాష అయిన సంస్కృతాన్ని కించపరిస్తే అంతకన్నా పాపము ఇంకోటి ఉండదు . సంస్కృతం డిస్కవర్డ్ భాష, ఇన్వెంటెడ్ భాష అనుట అప్రస్తుతం . ఈ శబ్దాలు ప్రకృతిలో పుట్టి , ఋషుల ద్వారా కనుక్కోబడి , మంత్రాలుగా పిలవబడుతున్నాయి . వాటిని ఏ విధంగానైనా మార్చుటకు ప్రయత్నిస్తే ప్రకృతిని ధిక్కరించినట్లే .

    ReplyDelete
    Replies
    1. దేనిని అయిన నేర్చుకోవలసిన విధానములో నేర్చుకుంటే ఏది పెద్ద బ్రహ్మ విద్య కాదు; చిత్త శుద్ధి , తపన వుంటే ఏది అయిన సాధ్యమే; జపాన్ లో కస్టమర్ వున్నాడని, ఆయనతో మాట్లాడటానికి జపనీస్ నేర్చుకోవటానికి ఇష్టపడే జనము అదే నోటి తో సంస్కృతము నేర్చుకుంటే రాదు అనేది ఏమి లేదు;--Uvn Pardha Saradhi

      Delete
  3. చిలుక ఈ మంత్రాలను పఠిస్తే ఫలితం పొందలేదు కదా!! ????

    కొన్ని చదవను కూడా అక్కరలేదు .
    శ్రవణ మాత్రేన పనులు అవుతాయి ...
    అమరనాథ్ కథ వినలేదా ?
    గుడ్డులోనుంచి వచ్చిన పక్షి , శివుడు పార్వతికి చెపుతున్న విద్య నేర్చుకొని
    ...ఆ చిలకే చివరికి శుక మహర్షి అయింది ?
    -kumar s vullaganti

    ReplyDelete
  4. మీ blog చదివి సంస్క్రుతము నెర్చుకొందాము అనుకొంతున్నాను

    ReplyDelete
    Replies
    1. చాలా సంతోషమండీ . తప్పక ప్రయత్నించండి . సంస్కృత భాష అతి సరళము . ( ముఖ్యంగా తెలుగువారికి ) దానివలన మీ జీవితము మంచి మలుపులు తీసుకుంటుంది

      Delete