SHARE

Wednesday, March 6, 2019

సంస్కృత భాషా బోధన -అధ్యాపకులు

సంస్కృత భాషా బోధన -అధ్యాపకులు 

అందరికీ నమస్కారము 
సంస్కృత భాషా బోధన గురించి నిన్న మేము పెట్టిన టపా కు అనూహ్య స్పందన లభిస్తున్నది. సంస్కృతము దేవభాష. దీనిని మృతభాషగా మార్చాలని ఎందరెందరో చేసిన ప్రయత్నాలకు గొడ్డెలిపెట్టుగా మీ స్పందన ఒక్కటీ చాలు. అనేక కృతజ్ఞతలు.

ఇక విషయానికి వస్తే,  మాకు టపా పంపిన వారందరూ విద్యార్థులే...సంస్కృతము నేర్చుకోవాలన్న ఆసక్తి చూపినవారే. 
అధ్యాపకుల నుండీ ఇంకా స్పందన రావలసి ఉంది. సంస్కృత భాషను నేర్చి, ఇతరులకు నేర్పించగల ప్రతిభ గల అధ్యాపకులకు ఇదే అవకాశము. మా  విన్నపము ఆలించండి. 
మీ సుముఖతను తెలియజేస్తూ స్పందించండి. సనాతన ధర్మ రక్షణలో పాలు పంచుకోండి. 
ఇది ఉచిత సేవ కాదు. మీరు చేయబోయే సేవకు తగిన పారితోషికము ఉంటుంది కాబట్టి, ఇది ఉభయతారకమైన మార్గము అని మేము చేపట్టడము జరిగింది. 
ఎలా నేర్పాలి, పాఠ్యాంశాలు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు వంటి వాటి గురించి మీరు చింతించవద్దు. తలపెట్టినది దైవకార్యము. ఆ దైవమే చూసుకుంటాడు. మన పని కేవలము మానవ ప్రయత్నము. 
కాబట్టి మరొక్కసారి ప్రార్థిస్తున్నాము, సంస్కృత అధ్యాపకులు ముందుకు రండి.

సనాతన ధర్మానికి జయము కలుగుగాక
ధన్యవాదం 

4 comments:

  1. నేను సంస్కృత బోధిస్తాను. మీరు సంకల్పం చాలా మంచిది. మిమ్మల్ని ఎలా సంప్రదించాలి

    ReplyDelete
  2. నేను సంస్కృతం బోధించెదనండి.

    ReplyDelete
    Replies
    1. స్పందించినందుకు అనేక ధన్యవాదాలు.
      సంస్కృతం నేర్పగలిగినవారు చక్కగా స్పందిస్తున్నారు. కానీ నేర్చుకొనే వారి స్పందన కరువైందండీ. వందలాది మంది మొదట స్పందించారు. వారందరికీ మొదట అప్లికేషన్ ఫారమ్ మెయిల్ ద్వారా పంపించాము. అప్లికేషన్ నింపి పంపినవారిని వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అందుకని దానిని అక్కడికే వదిలేయడము జరిగింది. భవిష్యత్తులో మరలా మొదలు పెడితే తప్పక మీ సహాయం తీసుకుంటాము.

      Delete
  3. స్పందించిన వారికి అనేక ధన్యవాదాలు.