SHARE

Friday, January 24, 2025

సనాతన ధర్మ సంహిత


 సనాతన బంధువులకు శుభ వార్త !!!!!!!!!



మన వ్యభిచార మీడియా , హిందువుల గురించిన అన్ని ముఖ్యమైన సమాచారాలనూ దాచేసి ఏమీ తెలియనట్టు మూతి తుడుచుకొని కూర్చుంటున్నాయి. అక్కడక్కడా ఒకటో రెండో వేరు కారణాల చేత వాటిని ప్రచురిస్తున్నాయి.

ఇది ఒక అత్యంత సంచలన విషయము. ఎంత ప్రచారం ఉండాలి? కానీ ఎందరికి తెలుసు? 


హిందువులు  తమ ఆచార సాంప్రదాయాలను మరచిపోయారనీ, వారికి దిశా నిర్దేశము చేసేవారు లేరని, ఎవరికి తోచినట్టు వారు చేస్తున్నారనీ, ప్రస్తుత కాలానికి తగ్గట్టి ఒక స్మృతి , లేదా సంహిత [ కోడ్ ఆఫ్ కండక్ట్ ] ఉండాలని ఎప్పుడూ వినబడే మాట.  మన పీఠాధిపతులు, జగద్గురువులూ ఎందుకు చొరవతో ఈ విషయం పై మార్గ దర్శనాలను ప్రకటించకూడదు? అని అనేకుల సందేహాలు.  పీఠాధిపతులూ, జగద్గురువులూ, ప్రవచనకారులూ ఎప్పటికప్పుడు తమ సందేశాలను ఇస్తూనే ఉన్నారు. అయితే హిందువులకు ఆదేశాలు ఇచ్చే స్థితిలో ఎవరూ లేకపోవడము, ఒక సమగ్ర వ్యవస్థను అందరూ పాటించాలనే నిబంధనలను ప్రకటించే స్థితిలో లేకపోవడమూ, ఇంకా అలాంటి కారణాల వల్ల అటువంటి చర్యలు ఎవరూ తీసుకోలేదు.... అని ఇంతకాలమూ అనుకుంటున్నాము.  కానీ ఇది చూడండి


మోదీజీ ప్రధాని కాక పూర్వమే, అంటే ఒక పదిహేను సంవత్సరాల వెనుకే, ఈ దిశలో ఎందరో కలసి పని చేశారు.  సాధువులు, సన్యాసులు, పీథాధిపతులు, జగద్గురువులు, హిందూ సంఘాలు, ముఖ్యమైన హిందూ నేతలు,  మేధావులు, విద్వాంసులు, చరిత్రకారులు, శంకరాచార్యులు,  ఒకరేమిటి, అన్ని రంగాల వారూ కలసి ఒక వేదికగా ఏర్పడ్డారు, ఎప్పుడూ? రెండు దశాబ్దాల కిందటే,  దానికి కేంద్రము వారణాసి. ఆ వేదిక పేరు " కాశీ విద్వత్ పరిషత్. " ఈ పరిషత్తు, వేద విజ్ఞానాన్ని పరిరక్షించి, ప్రచురించి, ప్రచారము చేసే  పనిలో చాలా అభివృద్ధి సాధించింది. 


వీరందరూ కలసి సమిష్టిగా ఇన్నేళ్ళూ పరిశోధించి, పరిశ్రమించి " హిందూ సంహిత " నొకదానిని తయారు చేసి, అందరి ఆమోదాన్నీ పొందారు. వేదాలలోని విషయాలు, మన సాంప్రదాయాలు, హిందువులు చేయవలసిన విధులు, చేయకూడనివి, ఆచార వ్యవహారాలు, పండుగలు, కర్తవ్యాలు, ఉత్సవాలు, క్రతువులు, తంతులు, యజ్ఞ యాగాదులు, వంటి ఎన్నెన్నో విషయాలను కూలంకషంగా చర్చించి, ఇప్పటికి ఒక పుస్తకంగా సిద్ధమైంది.


 దీన్ని ఈ కుంభమేళాలో విడుదల చేయనున్నారు.


ఇంతకాలమూ దీనిగురించిన అన్ని విశేషాలనూ గోప్యంగా ఉంచారు. విశ్వ హిందూ పరిషత్, అఖిల భారత సాధు సమితి, ఇంకా ఇతర అఖాడాలు, సంఘాలు అన్నీ కలసి ఈ నెల ఇరవై ఏడున దీన్ని విడుదల చేయబోతున్నారు. వేలాది ప్రతులను కుంభమేళాలో అందరికీ పంచుతారు.  దేవకీనందన్ ఠాకుర్ [ ఆధ్యాత్మిక గురువు ], జీతేంద్రానంద సరస్వతి [ అఖిల భారత సాధు సమితి జనరల్ సెక్రెటరీ ] వంటి అనేకులు ఈ విషయం పై నిన్న కొంత సమాచారాన్ని పంచుకున్నారు. 


ఇంతకీ ఈ సంహితలోని విషయాలు ఏవి? అన్నదానిమీద ఇంక అ గోప్యత వీడలేదు కానీ, మచ్చుకి కొన్ని ఇదిగో


** రాత్రి పూట పెళ్ళిళ్ళను నిషేధించబోతున్నారు. వారి పరిశోధన ప్రకారము, పగటి పూట సూరుడి సాక్షిగా మాత్రమే పెళ్ళిళ్ళు జరగాలి


** భ్రూణ హత్యలు మహా పాపము


** వరకట్న నిషేధము


** స్త్రీలు పురుషులకు అన్నిటా సమానము. వారు యజ్ఞయాగాదులు కూడా చేయవచ్చు. 


** అస్పృశ్యత అనేది మన ధర్మంలో ఎప్పుడూ లేదు,  బానిసత్వం పేరుతో దాన్ని ఒక కాలంలో  మొదలుపెట్టారు. అన్ని దేవాలయాల్లో ఎస్ సి ఎస్ టి వారికి ప్రవేశం ఉంటుంది. 


** పుట్టుకతో అందరూ  హిందువులే కాబట్టి, ఎవరైనా హిందువుగా తిరిగి మారాలనుకుంటే అది మత మార్పిడి కాదు, కేవలం ’ ఘర్ వాపసీ ’ మాత్రమే. 


** దేవాలయాలు ప్రభుత్వపు నియంత్రణ నుండీ బయట ఉండాలి


** " సనాతన బోర్డు " నొకదానిని స్థాపించి వీటిని పర్యవేక్షించాలి. 


ఈ నెల ఇరవై యేడవ తారీకును " ధర్మ స్వతంత్రతా దివస్ " గా ప్రకటించబోతున్నారు. [ ఫ్రీడమ్ ఆఫ్ ధర్మ్ డే ]


జై హింద్

జై సనాతన ధర్మ

 భారత్ మాతా కి జై

Thursday, January 23, 2025

కుంభమేళా వెనుక కుట్ర జరుగుతోందా?


కుంభమేళా వెనుక కుట్ర జరుగుతోందా? సనాతన ధర్మము పునరుజ్జీవితము కావడం సహించలేని వారు నీచమైన పనులకు ఒడిగట్టడం నిజంగా గర్హనీయం. వారి వ్యూహాలను కపటాలను తెలుసుకోకపోవడం హిందువుల మూర్ఖత్వానికి పరాకాష్ఠ లాంటిది
మహా కుంభమేళా అంటే ఎంతటి మహోన్నత, మహత్తర ఘట్టము? నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే సువర్ణావకాశము. పవిత్రమైన త్రివేణీ సంగమంలో కుంభమేళాలో స్నానమాచరిస్తే అంతకన్న గొప్ప పుణ్యం ఇంకోటి ఉండదు. స్నానం అనేది కేవలం ఒక చిన్న ఉపలబ్ధి మాత్రమే. పైగా రానున్నది మాఘ మాసము. మాఘ మాసం లో కుంభమేళా యొక్క ప్రాశస్త్యము చూడండి.
****************************
కుంభమేళాలో మాఘ మాసము
( ధర్మ సింధువు ప్రకారము )
మాఘ మాసమందు ప్రాతఃస్నానము చేయాలి. హవిష్యము ( హోమము ) , బ్రహ్మ చర్యము , మాఘస్నానము - గొప్ప ఫలాన్ని ఇస్తాయి. మాఘ మాసము వస్తే సూర్యోదయము కాగానే జలములన్నీ శబ్దిస్తాయి .. త్రివిధములైన సర్వ పాపములనూ పోగొట్టి పవిత్రులను చేస్తాయి. ఉషః కాలములో సూర్యకిరణములతో వేడెక్కిన అందమైన నదీ ప్రవాహమునందు స్నానమాచరించిన వారు పితృ , మాతృ వంశములకు చెందిన తన సప్త ఋషులను ఉద్ధరించి , పిదప అమర దేహుడై స్వర్గమునకు వెళతాడు. అరుణోదయము కాగానే విచక్షణుడు మాధవుని పాద ద్వంద్వమును స్మరిస్తూ స్నానం చేస్తే సురపూజితుడవుతాడు.
నక్షత్రములుండగా చేసిన స్నానము ఉత్తమము. చుక్కలుపోయాక చేసినది మధ్యమము. సూర్యుడుదయించాక చేసినది అంతకన్నా హీనము.ఈ స్నానము ప్రయాగ నందు చాలా ప్రశస్తమైనది. గంగయందు , సంగమమందు చేసినది కాశీ యందలి స్నానము కన్నా నూరు రెట్లు పుణ్యప్రదము. పశ్చిమ వాహిని స్నానము దానికన్నా వేయిరెట్లు అధిక ఫలము . అట్లాగే సముద్రమందు కూడా ఈ స్నానము మిక్కిలి ప్రశస్తమైనది.
మాఘ శుక్ల త్రయోదశి నుంచీ మూడు రోజులు ' మాఘీ ' అంటారు.. కనీసము ఆ మూడురోజులయినా నదీ / సముద్ర స్నానము చేయాలి.
మాఘ స్నానమున నియమములు ;
స్నానం చేయకుండా అగ్ని దగ్గర కూర్చోరాదు. స్నానం చేయకుండా అగ్ని సేవనము తగదు. హోమము కొరకు వహ్నిని సేవించాలేకానీ శీతము కొరకు వద్దు. ప్రతి రోజు చక్కెర తో కూడిన నువ్వులను దానము చేయాలి. మూడు భాగములు నువ్వులు , ఒక భాగము చక్కెర ఉండాలి.
వ్రతమందున్నవాడు నెలమొత్తము అభ్యంగనస్నానము లేకుండా గడపాలి. వహ్నిహోమము చేసి ఏకాశనుడు కావాలి. భూశయ్య , బ్రహ్మచర్యము వీని యందు శక్తుడైనవాడు స్నానం చేయాలి. అశక్తుడు అంతట స్వేచ్చగా ఉండొచ్చు. అట్లాగే తిలల స్నానము. తిలలు ( నువ్వులు ) వంటికి రాచుకోవడము , తిల హోమము , తిలతర్పణము , తిలభోజనము , తిలదానము.--ఈ ఆరు రకముల తిలలు పాప నాశకములు.
స్నానము తర్వాత కట్టెవలె మౌనము గానుండి నమస్కరించి పురుషోత్తముని పూజించాలి.
దానములు ;
నూనె , ఉసిరికాయలు వీటిని ప్రతిరోజు తీర్థమందు ఇవ్వాలి. బ్రాహ్మణుల సేవనము కొరకు అగ్నిని ప్రజ్వలింపజేయాలి. భోజనాలు తృప్తి వరకూ ఏర్పాటు చేయాలి. వస్త్ర భూషణములతో అలంకరించి ద్విజ దంపతులను భుజింపజేయాలి. కంబలము , జింక చర్మము , రత్నములు, వివిధ వస్త్రములు , రవికలు , కప్పుకొనుటకు వస్త్రాలు ఇవ్వాలి. చెప్పులు గుల్మ మోచకములు మరియు పాపమోచకములు కాబట్టి వానిని ఇవ్వాలి.
శక్తి కొద్దీ అన్నదానము చేయాలి. వేదవిద్వాంసునకు గుంజెత్తు అయినా బంగారమివ్వాలి. మాఘమాసాంతమందు షడ్రస భోజనమాచరించాలి.
నిజానికి ప్రాతఃస్నానము పుష్య మాస శుక్ల పక్ష ఏకాదశిన మొదలు పెట్టి మాఘ శుక్ల ద్వాదశిన గానీ , పౌర్ణమి యందు గానీ సమాప్తి చేయాలి. రోజు భూమిపై పరుండాలి ( మంచము వదలి ) నెలరోజులు మితాహారుడై , లేదా నిరాహారుడై త్రికాలములయందు స్నానము చేసి , భోగములను వదలి , జితేంద్రియుడై త్రికాలాలలోను విష్ణువును అర్చించాలి.
భవిష్యపురాణము ప్రకారము , బ్రహ్మచారి , గృహస్థు, వానప్రస్థుడు , భిక్షకుడు , బాలురు , వృద్ధులు, యువకులు , స్త్రీలు , నపుంసకులు అందరూకూడా మాఘమాసమందు శుభమైన తీర్థమందు స్నానం చేసి, కోరిన ఫలమును పొందుతారు. అవయవములు దృఢం గా ఉన్నవారు చన్నీటి తోను , లేనివారు వేడి నీటి తోను స్నానం చెయ్యవచ్చు. పుష్య పౌర్ణమి గడిచాక మాఘ పౌర్ణమి వచ్చే వరకు విష్ణుపూజ విధిగా చేయాలి. పితరులకు , దేవతలకు ముల్లంగి ఇవ్వరాదు. బ్రాహ్మణుడు ముల్లంగి తింటే చాంద్రాయణ వ్రతాన్ని ఆచరించాలి. అలాగే క్షత్రియ , వైశ్య , శూద్రులు కూడ..ప్రతిరోజు స్నానము చేయునపుడు , ఈ మంత్రాన్ని ఉచ్చరించి , మౌనముగా స్నానమాచరించాలి
దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోః తోషణాయ చ
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం ॥
మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ
స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భవ ॥
ప్రతి రోజు సూర్యార్ఘ్యమివ్వాలి.
రథ సప్తమి
దీన్నే , అచలాసప్తమి , మాఘ శుక్ల సప్తమి , మకర సప్తమి అని అంటారు
ఇది కోటి సూర్యుల సమానము. అందు స్నాన , అర్ఘ్య దానములు చేయాలి. అందువల్ల ఆయుస్సు , ఆరోగ్య సంపదలు లభిస్తాయి. నదిలో స్నానము చేస్తే , షష్టి యందే ఏకభుక్తం ( ఒంటి పూట భోజనము ) ఆచరించి , సప్తమియందు అరుణోదయ స్నానము చేయాలి. నిశ్చల జలము యొక్క పైభాగాన దీపముంచాలి. ఈ దీపాన్ని బంగారు , లేదా వెండి లేదా ఆనపకాయ పాత్రలో చేసి భక్తితో నూనె , వత్తి వేయాలి. పసుపు రంగు , కేసరి రంగుతో అలంకరించాలి. మొదట మనసును పదిలపరచుకొని శిరస్సు యందు దీపముంచుకొని సూర్యుని హృదయము నందు ధ్యానించి ఈ మంత్రాన్ని పలకాలి
॥ నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః
వరుణాయ నమస్తే`స్తు హరివాస నమో`స్తుతే..॥
సూర్యుణ్ణి ధ్యానించి దీపాన్ని నీట వదలాలి. నీటిలో , చందనం తో , ఎనిమిది ఆకులు గల పద్మమును వ్రాసి , కర్ణికను కూడా రాయాలి . మధ్యలో పత్నితో కూడిన శివుని ప్రణవముతో కూడా రాయాలి. తూర్పు దళముతో మొదలుపెట్టి , రవి , భాను , వివస్వత్ , భాస్కర , సవితృ , అర్క , సహస్ర కిరణ , సర్వాత్మకులను ధ్యానించి పూజించి ఇంటికి వెళ్ళాలి.
ఇంటి యందు స్నానం చేస్తే ( పాదోదక స్నానం ) చెరుకు గడ తో నీటిని కదిలించి , ఏడు జిల్లేడాకులు , రేగు ఆకులు తలపైన , భుజాలపైన ఉంచుకొని , ఈ మూడు మంత్రాలు చెప్పాలి
॥ యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు
రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ ॥
॥ ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం
మనో వాక్కాయజం ఉచ్చ జ్నాతాౕజ్నాతేచ యే పునః ॥
॥ ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్తసప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి ॥
స్నానం చేసి , నువ్వుల పిండితో చేసిన అపూపములతో బంగారు సూర్యుణ్ణి పూజించి బ్రాహ్మణుడికి దానమివ్వాలి. కింది మం త్రముతో సూర్యుడికి అర్ఘ్యము ఇవ్వాలి
॥ సప్తసప్తి వహప్రీత సమలోక ప్రదీపన
సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర ॥
********************************************************
వీటికి తోడు, ప్రవచనాలు, భజనలు, అనుష్ఠానాలు, శ్రాద్ధాలు, తర్పణాలు, సత్సంగాలు, దానాలు ఎన్నెన్ని ఉన్నాయి? కుంభమేళా అంటే వీటన్నిటి కలయిక.
ఇంతేకాక, కుంభమేళాకే ప్రత్యేకమైనదొకటి ఉంది
అదే, " కల్ప వాసము " అంటే త్రిసంధ్యా స్నానాలు, జపాలు, అనుష్ఠానాలు, దానాలు, సాత్విక శాకాహారము, నక్తాలు [ ఒంటి పూట భోజనం] .. ఇవన్నీ ఆచరిస్తే దాన్ని కల్పవాసం అంటారు. ఈ పేరు ఎందరికి తెలుసు? అక్కడికి వెళ్ళి వచ్చినవారికైనా తెలుసా?
పైన చెప్పినవన్నీ ఈ కల్పవాసము కిందకే వస్తాయి.
కుంభమేళాలో ఆచరించవలసిన వాటిని తెలియనివ్వకుండా, ఆచరించేలా చేయనీకుండా తద్వారా ధర్మ భ్రష్టులను చేసే భయంకర కుటిల వ్యూహము ఒకటి నడుస్తోంది.
కొందరు వ్యక్తులు, కుంభమేళా నుండి జనాల దృష్టి మరల్చి, తుచ్ఛమైన వాటి వెంట పడేలా యుక్తులు పన్నారు. వారిలో కొందరిని అక్కడక్కడా నిలబెట్టి, వారికి విపరీతమైన ప్రచారము కల్పించటము, --ఇప్పుడు ఏవేవో చదువుతున్నాము.. ఎవరో వ్యక్తి కళ్ళు బాగున్నాయి, ఒళ్ళు బాగుంది, జడలు బాగున్నాయి అంటూ వారు నిలబెట్టిన మనుషులకు విపరీత ప్రచారం కల్పించి, జనాలను ధర్మ భ్రష్టులుగా చేయడము--, ఎవరో ఒక సాధువును దేవుడిగా మార్చడము, మిగతావన్నీ మరచేలా చేసి, జనాలు వారి వెంట బడేలా చేయడము--ఇదంతా కుట్ర కాక మరేమిటి? ఇందులో విదేశీ చేతులు, దావూద్ చేతులు లేవంటే నమ్మలేము.
ఒకవేళ, అదంతా కేవలం ఊహ, అలాంటిదేమీ లేదు---అనుకుంటే,
మరి జనాలెందుకు వేలం వెర్రిలా అటువంటి వ్యక్తులకు ప్రాముఖ్యత ఇచ్చి, అసలైన తమ విధులను మరచిపోతున్నారు? ఆలోచించవలసిన అవసరం లేదా?
అక్కడ ప్రభుత్వం ద్వారానూ, హిందూ సంఘాల ద్వారానూ ఏర్పాటైన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. వాటి గురించి ఒక్క టీవీలోనూ రాదు. ఎంతసేపూ పక్కదారిపట్టించే సమాచారాలే. అక్కడే మనం అప్రమత్తులం కావాలి.
వారు చానెళ్ళలో చూపించకపోతే పోయింది, వెళ్ళిన భక్తులు ఆయా వీడియోలు చేసి, సామాజిక మాధ్యమాల్లో పెట్టవచ్చు కదా, ఆ పని అతి కొద్ది మందే చేస్తున్నారు. వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా అక్కడి ఆధ్యాత్మిక విషయాలను వీడియోలు తీసి పంచుకోవాలి.
గతం లో అంటే, ఇప్పటిలాగా ఇంటర్ నెట్లూ, ఏ ఐ, వంటివి లేవు కాబట్టి కేవలము ప్రాయోజిత కార్యక్రమాలు మాత్రమే దూరదర్శన్ లో వచ్చేవి. ఇప్పుడా ప్రతి బంధకం ఏమీ లేదు. ఎవరైనా అక్కడి విశేషాలను పంచుకోవచ్చు.
ధర్మ విరోధ శక్తుల కుటిల వ్యూహాలను త్రిప్పికొట్టేలా ఇప్పుడైనా మనం తగు చర్యలు తీసుకుందాము, ఇంకా సమయం ఉంది
దయచేసి ఎవ్వరూ ఆ చిల్లర వీడియోలను పంచుకోవద్దు. కేవలం ఆధ్యాత్మిక వీడియోలను మాత్రమే పంచుకుందాము.
॥ శుభం భూయాత్ ॥

This post was restricted in Facebook. No one could see this there